వావ్ నాని.. సూపర్ డైరెక్టర్ తో సినిమా.. ఫ్యాన్స్ ఖుష్?

Purushottham Vinay
ఈ సంవత్సరం మోస్ట్ సక్సెస్‌ఫుల్ టాలీవుడ్ హీరో ఎవరంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు నేచురల్ స్టార్ నాని. నాని మళ్ళీ సూపర్ ఫాంలోకి వచ్చాడు. ఇక ఈ ఇయర్ దసరా సినిమాతో మరో క్లాసిక్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని..రీసెంట్ గా హాయ్ నాన్న లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రస్తుతం సూపర్ పాజిటివ్ టాక్‌తో థియేటర్‌లలో చాలా బాగా రన్ అవుతుంది. ఇక ఈ సినిమా తరువాత నాని వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉండగానే నాని మరో స్టార్ దర్శకుడితో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇంతకి ఆ దర్శకుడు ఎవరో కాదు జిగర్ తండా డబుల్ ఎక్స్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు.


అయితే ఇతని కంటే ముందు 6 తమిళ డైరెక్టర్లు నాని కోసం క్యూ కట్టారు కానీ కుదర్లేదు. ఆ తరువాత డాన్ డైరెక్టర్ శిబి చక్రవర్తితో సినిమా చెయ్యాలనుకున్నాడు నాని. కానీ అది కూడా కుదర్లేదు.ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుతో కలిసి పని చేస్తున్నందుకు నాని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.నాని తన తదుపరి ప్రాజెక్ట్ కార్తీక్ సుబ్బరాజుతో చేస్తున్నట్లు గట్టిగా సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నానిని కలిసిన సుబ్బరాజు ఒక లైన్ ను కూడా వినిపించాడట. ఆ లైన్ నానికి బాగా నచ్చడంతో వెంటనే ఆ సినిమాకి ఒకే చెప్పేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కథ చర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్టు పై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం తెలుస్తుంది. ఇక ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ప్రోడ్యూస్ చేయనున్నట్లు సమాచారం తెలుస్తుంది.అయితే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: