కళ్యాణ్ రామ్ డెవిల్ ట్రైలర్ ఈరోజే..!!
ఈ సినిమా ట్రైలర్ ఈ రోజున సాయంత్రం 5:29 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ ట్రైలర్ కోసం చాలామంది అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 29వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తూ ఉన్నారు. ఈ సినిమ లో దేశ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా డెవిల్ ముసుగు వేసుకున్న టువంటి బ్రిటిషర్ల కోసం కళ్యాణ్ రామ్ ఎందుకు ఇలాంటి పని చేశారు అని కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
లుక్స్ పరంగా కాస్టూన్స్ పరంగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మరో సరికొత్తగా కనిపించబోతున్నారు. గతంలో నటించిన అమీఘోష్ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకుంది. దీంతో ఇప్పుడు డెవిల్ సినిమా పైన భారీ ఆశలు పెట్టుకున్నారు కళ్యాణ్ రామ్. ఈ సినిమా సక్సెస్ అయితే కళ్యాణ్ రామ్ కెరియర్ మరో సారి గేటినైనట్టే అని చెప్పవచ్చు. సంయుక్త మీనన్ కూడా దాదాపుగా ఈ సినిమా తర్వాత మరే సినిమాలో కూడా నటించలేదు మరి ఈ ముద్దుగుమ్మకు కూడా ఈ సినిమా ఏ విధంగా కలిసొస్తుందో చూడాలి మరి. ట్రైలర్‌తో ఈ సినిమా పైన భారీగా అంచనాలను పెంచేస్తుందేమో చూడాలి.