కాస్టింగ్‌ కౌచ్‌: విచిత్ర అన్నది బాలయ్య గురించి కాదా?

Chakravarthi Kalyan
భలే వాడివి బాసులో పని చేసిన హిరోయిన్ విచిత్ర ఆ చిత్రంలో హిరోగా పనిచేసిన బాలకృష్ణ పై సంచలన ఆరోపణలు చేశారు. షూటింగ్ అయిపోగానే బాలయ్య అసభ్యంగా ప్రవర్తించే వాడని రూమ్ లోకి రావాలని కోరేవాడని, ఇష్టమున్న చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించే వాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో బాలయ్య బాబు క్యారెక్టర్ ఇలాంటిదని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు.

భలేవాడివి బాసు సినిమా తర్వాత నేను సినిమా రంగంలో ఉండకూడదని నిర్ణయించుకున్నానని ఆ హిరోయిన్ చెప్పింది. సినిమా రంగంలో అందరూ ఇలా ఉంటారేమోనని భయం వేసి దూరంగా ఉన్నానని ప్రకటించింది. మరి ఇలాంటి సమయంలో బాలయ్య బాబు టీడీపీ నుంచి ఎమ్మెల్యే గా ఉన్నారు. టీడీపీలో ప్రధాన నాయకుడు. గతంలో కూడా అమ్మాయిల మీద చేసిన కామెంట్లను గుర్తు చేస్తూ వైసీపీ నాయకులు తెగ ప్రచారం చేస్తున్నారు.

అయితే టీడీపీ నాయకులు ప్రతిగా ఆమె 2001 లో భలే వాడివి బాసు సినిమా చేసింది. అప్పుడు ఆమెను వేధింపులకు గురి చేసిన స్టంట్ మాస్టర్ విజయ్ పై 2012 లో కోర్టులో కేసు వేసింది. బాలయ్య బాబుకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద ఆమె వ్యాఖ్యలతో సోషల్ మీడియా లో వైసీపీ, టీడీపీ మధ్య ఒక రకమైన యుద్ధమే జరుగుతుంది.

ఇప్పటికే క్యాస్టింగ్ కోచ్ తో తెలుగు సినీ ఇండస్ట్రీపై చాలా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల్లో నిజమెంత ఉంది. అబద్ధాలు ఎంత అనేది పక్కన పెడితే 20 ఏళ్ల కిందట ఇలాంటి ఘటనలు జరిగాయంటే బయటకు రాని అంశాలు ఎన్నో ఉండి ఉంటాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది అందుకే ఇండస్ట్రీకి రావడానికి మొహమాటపడుతున్నారని, ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని, ముఖ్యంగా భయపడుతున్నారని చాలా మంది సినీ రంగానికే చెందిన వ్యక్తులు చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: