వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఆ రెండు సినిమాలు రీ రిలీజ్..?

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో రీ రిలీజ్ ల ట్రెండ్ జోరుగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటివరకు ఎన్నో తెలుగు సినిమాలు ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించాయి. ఇక ఇలా సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరిస్తూ ఉండడంతో ఏదైనా మంచి క్రేజ్ ఉన్న ఈ హీరో పుట్టిన రోజు వచ్చినట్లు అయితే ఆ హీరో కెరియర్ లో అద్భుతమైన విజయవంతమైన సినిమాలను రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఎంతో మంది హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి కెరియర్ లో బ్లాక్ బాస్టర్ సినిమాలు గా నిలిచిన వాటిని విడుదల చేశారు.

అందులో భాగంగా విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా కూడా ఆయన కెరియర్ లో అద్భుతమైన విజయవంతమైన రెండు సినిమాలను రీ రిలీజ్ చేయడానికి చిత్ర బృందాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించాడు. అందులో బొబ్బిలి రాజా ... జయం మనదేరా సినిమాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ సంవత్సరం డిసెంబర్ 13 వ తేదీన వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రెండు సినిమాలను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రీ రిలీజ్ చేయాలి అని ఆలోచనలో ఈ చిత్ర బృందాలు ఉన్నట్లు ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులను ఫుల్ స్పీడ్ గా చేస్తున్నట్లు మరికొన్ని రోజుల్లోనే ఇందులు సంబంధించిన అధికారిక ప్రకటనలను కూడా విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ మూవీ ల రీ రిలీజ్ కోసం వెంకటేష్ అభిమానులు చాలా ఆత్రుతగా ... ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాలను ఈ సంవత్సరం వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా రి రిలీజ్ చేస్తారో ... లేదో అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: