మొదటి సినిమాకె నంది అవార్డు అందుకున్న చంద్రమోహన్..!!
మొదటిసారి 1966ల రంగుల రత్నం అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చంద్రమోహన్.. బి.యన్.రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డును సైతం అందుకోవడం జరిగింది. ఆ తర్వాత బెస్ట్ కమెడియన్ గా 1987లో కూడా చందమామ రావే అనే చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు.. 2005లో సహ నటుడుగా అతనొక్కడే సినిమాకి కూడా నంది అవార్డుని అందుకున్నారు. 1978లో వచ్చిన పదహారేళ్ళ సినిమాకు కూడా బెస్ట్ యాక్టింగ్ ఫిలిం ఫేర్ అవార్డును కూడా అందుకున్న చంద్రమోహన్ ఎన్నో లోకల్ సంస్థల అవార్డులను కూడా అందుకున్నారు.
చంద్రమోహన్ కెరియర్ లో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న ఈ నటుడు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నప్పటికీ పలు సంస్థలు చంద్రమోహన్ ను పిలిచి పలు రకాల అవార్డులతో సత్కరించేవారు.. చివరిగా చంద్రమోహన్ గోపీచంద్ నటించిన ఆక్సిజన్ సినిమా లో నటించడం జరిగింది. దాదాపుగా 900 కు పైగా సినిమాలలో నటించి మెప్పించిన చంద్రమోహన్ చాలామంది హీరోయిన్స్ సైతం స్టార్ పొజిషన్లోకి తీసుకువచ్చారు. ఈయన నటన తో మెప్పించిన ఎంతో మంది చంద్రమోహన్ కామెడీ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. చంద్రమోహన్ అంత్యక్రియలు మహాప్రస్థానంలో సోమవారం రోజున జరుగుతున్నట్లు కుటుంబ సభ్యుల సైతం తెలియజేశారు.