బాలయ్య వల్లే హీరోయిన్ అంకిత కెరియర్ ఎండ్ అయ్యిందా..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సింహాద్రి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ అంకిత.. ఈమె మొదట రస్నా యాడ్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అంకిత ఆ తర్వాత లాహిరి లాహిరి సినిమాతో మంచి క్రేజ్ అందుకుంది. ఆ తర్వాత సింహాద్రి ,విజయయేంద్ర వర్మ సీతారాముడు, ఖతర్నాక్ తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నది.. అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ వంటి భాషలలో కూడా నటించింది. ఈ హీరోయిన్ సడన్ గా దూరం కావడంతో అభిమానులు సైతం తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.

అంకిత 2016లో విశాల్ అనే ఒక బిజినెస్ మాన్ ని వివాహం చేసుకోవడం జరిగింది.. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి సినిమాలో అంకిత హీరోయిన్గా నటించి అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత ఈమె రేంజ్ మారిపోతుందని అందరూ అనుకోగా..కానీ ఈమె జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా అంకిత మాట్లాడుతూ దాదాపుగా కెరీర్ అయిపోతున్న సమయంలో బాలకృష్ణ తో కలిసి విజయేంద్ర వర్మ సినిమాలో నటించే అవకాశం వచ్చినది.. ఈ సినిమా పైన ఆశలన్నీ పెట్టుకొని నటించాను.. ఈ సినిమా సక్సెస్ అయితే తన కెరీర్ ముందుకు వెళుతుంది లేకపోతే అంతే అనుకున్నాను.

కానీ బాలకృష్ణ సినిమా కావడంతో ఆశలు పెట్టుకొని నటించగా ..చివరికి ఆ సినిమా కూడా చాలా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది. దీంతో తన కెరియర్ అక్కడితో ఆగిపోయిందని తెలిపింది..గ్లామర్ ఫీల్డ్ లో ఎక్కువ రోజులు హీరోయిన్గా రాణించాలి అంటే కచ్చితంగా సక్సెస్ అనేది ఒక భాగం అని తెలిపింది. సక్సెస్ లేకపోతే ఇండస్ట్రీలో ఉండడం చాలా కష్టమని తెలియజేసింది అంకిత.. మొత్తానికి బాలయ్య సినిమా వల్లే అంకిత కెరియర్ ఎండ్ అయ్యిందని చెప్పకనే పరోక్షంగా తెలియజేసిందని చెప్పవచ్చు. ప్రస్తుతం తన లైఫ్ని మాత్రం ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది అంకిత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: