లియోకి దారుణమైన పరిస్థితి.. ఓ రేంజ్ లో ట్రోల్స్?

Purushottham Vinay
వారసుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తమిళ హీరో జోసెఫ్ విజయ్  నటించిన తాజా చిత్రం లియో. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈనెల 19న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్లు నమోదు చేయలేక అట్టర్ ప్లాప్ గా మిగిలిపోయింది. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోపై నిర్మించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించింది. ప్రియా ఆనంద్‌, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్ వాసు దేవ్‌మీనన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌ ఇంకా సాండీ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.అయితే లియో మూవీ గురించి నిర్మాత చెబుతున్న కలెక్షన్స్ ఫేక్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో లియో మూవీ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంది.సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో పక్కా ఫ్రాడ్ అని నెటిజన్స్ ఆ నిర్మాణ సంస్థని ఏకిపారెస్తున్నారు.


ఫేక్ వసూళ్ళని నమోదు చేసినందుకు గాను #Fraud7ScreenStudios అనే ట్యాగ్ ని X లో నెటిజన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు.లియో సినిమా వసూళ్లు భారీగా పడిపోయాయి. వీకెండ్స్ లో కూడా ఈ సినిమా వసూళ్లు రాబట్టలేకపోతుంది. ఈ సినిమాకి భారీ నష్టాలు వచ్చాయి.కానీ ఈ సినిమా వసూళ్లు మాత్రం ఓ రేంజ్ లో వచ్చాయని మూవీ టీం డబ్బా కొట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ స్కిన్ కార్ ప్రొడక్ట్ కంపెనీ WOW తమ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కొంటే లియో సినిమా టిక్కెట్లు ఫ్రీగా ఇస్తామని ఆఫర్ ప్రకటించారు.అయినా కానీ ఈ సినిమా టిక్కెట్లు అమ్ముడు కావడం లేదు.అంత దారుణంగా మారింది లియో పరిస్థితి. ఈ షాక్ తో లోకేష్ కనగరాజ్ తన తరువాత సినిమాలపై పూర్తి శ్రద్ధ పెట్టాడు. లియో మచ్చని తొలగించేందుకు తన తరువాత సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

LEO

సంబంధిత వార్తలు: