వావ్:11 భాషలలో సినిమాని విడుదల చేస్తున్న కుర్ర హీరో..!!

Divya
యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న తాజా చిత్రం హనుమాన్.. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి ఈ సినిమా మైథాలాజికల్ సూపర్ హిట్ చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు.. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ మొదలై ఇప్పటికీ చాలా కాలం అవుతోంది .ఈ సినిమా కోసం చాలామంది ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. టీజర్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన హనుమాన్ సినిమాని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృంద ఇదివరకే ప్రకటించింది.

అయితే సంక్రాంతి పోటీ చాలా తీవ్రంగా ఉండడంతో ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపించాయి కానీ చిత్ర బృందం మాత్రం విడుదల తేదీ పైన మరొక్కసారి క్లారిటీ ఇచ్చేశారు. అలాగే ట్రైలర్ గురించి కూడా అదిరిపోయి అప్డేట్ ఇవ్వడం జరిగింది. దసరా పండుగ సందర్భంగా హనుమాన్ సినిమాకి సంబంధించి ఒకసారి కొత్త పోస్టర్ని సైతం విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్లో తేజ సజ్జా కొర మీసాలతో చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉన్నారు. జనవరి 12వ తేదీన హనుమాన్ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోందని తెలిపారు.

హనుమాన్ సినిమా ట్రైలర్ ని కూడా అతి త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు అలాగే ఇతర భాషలలో పోస్టర్లను కూడా రిలీజ్ చేయడం జరిగింది హనుమాన్ సినిమా తెలుగుతోపాటు అన్ని భాషలలో కూడా విడుదల చేయబోతున్నారు. ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నది.. హనుమాన్ సినిమాని హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ,మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, జపనీస్ ,చైనా వంటి భాషలలో విడుదల చేయబోతున్నారు హనుమంతుడు వల్ల సామాన్య మానవునికి శక్తులు వస్తే ఏం జరుగుతుంది అనే కథ అంశాలతో తెరకెక్కించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: