అఫిషియల్ : "ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" విడుదల తేదీ ప్రకటన..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ మంచి గుర్తింపుని ఏర్పరచుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న "ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా ... హరీజ్ జయరాజ్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది. అలాగే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇకపోతే ఈ మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేసిన పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టర్ ఫుల్ గా వైరల్ అవుతుంది.
 


ఇకపోతే ఈ సినిమా కథ ఎక్కువ శాతం ఓ సినిమా నిర్మాణానికి సంబంధించి ఉండబోతున్నట్లు అందులో వచ్చే సన్నివేశాలు చాలా కామెడీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే వక్కంతం వంశీ కొంత కాలం క్రితం అల్లు అర్జున్ హీరోగా రూపొందిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో సీరియస్ కాన్సెప్ట్ ను టచ్ చేసిన వక్కంతం వంశీ "ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" సినిమాలో మాత్రం చాలా కామెడీ జోన్ ను టచ్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: