మాస్ మహారాజా రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావు అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా ... మురళీ శర్మ , అనుపమ్ కేర్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 20 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ టైగర్ నాగేశ్వరరావు అనే బందిపోటు దొంగ కు సంబంధించిన జీవిత కథ ఆధారంగా రూపొందింది.
ఇక ఈ మూవీ బందిపోటు దొంగ అయినటువంటి టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిన నేపథ్యంలో ఈ మూవీ లో రవితేజ కూడా బందిపోటు దొంగ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పాటలను , కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ట్రైలర్ ను ఈ చిత్ర బృందం విడుదల చేయగా ఈ ట్రైలర్ ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ సినిమా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ జనాల నుండి లభించడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. ఈ మూవీ యొక్క హిందీ మరియు తెలుగు వర్షన్ నార్త్ ఇండియా హక్కులను రిలయన్స్ సంస్థ దక్కించుకున్నట్లు ఈ మూవీ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ రవితేజ కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.