సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటించిన 'మామా మశ్చీంద్ర' సినిమా ఈ రోజు విడుదల అయ్యింది.ఇందులో సుధీర్ బాబు త్రిపాత్రాభినయం కనబరచడం ఇంకా అలాగే ‘మనం’ వంటి చిత్రానికి రైటర్ గా పనిచేసిన హర్షవర్ధన్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమవుతుండటం తో అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. టీజర్, ట్రైలర్ కూడా పర్వాలేదు అనిపించాయి. మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.సుధీర్ బాబు ఫస్ట్ టైం ట్రిపుల్ రోల్ ప్లే చేశాడు. తన వరకు మూడు పాత్రలకి ఖచ్చితంగా న్యాయం చేశాడు. ఆ లుక్స్ వల్ల అతను ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. ఆ కష్టం మూవీలో కనిపిస్తుంది.ఈషా రెబ్బా, మృణాళిని రవి… కొంతసేపు బాగానే గ్లామర్ వలకబోశారు. అయితే నటన పరంగా వాళ్ళు కొత్తగా చేసింది మాత్రం ఏమీ లేదు. ఇక హర్షవర్ధన్ ఎప్పటిలాగే తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక రాజీవ్ కనకాల, ‘మిర్చి’ కిరణ్, హరితేజ, అజయ్ వంటి వారు కూడా తమ తమ పాత్రలకి బాగానే న్యాయం చేశారని చెప్పుకోవచ్చు.
ఇక రచయితగా హర్షవర్ధన్ ‘మనం”గుండెజారి గల్లంతయ్యిందే’, వంటి క్లాస్ సినిమాలకి పనిచేసి హిట్లు కొట్టాడు. డైరెక్టర్ గా ముందుగా ఇతను ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమా చేశాడు. అయితే అది రిలీజ్ కాలేదు.ఈ ‘మామా మశ్చీంద్ర’ అతని మొదటి సినిమాగా రిలీజ్ అయ్యింది. ఇక రైటర్ అండ్ డైరెక్టర్ గా తను అనుకున్న పాయింట్ బాగానే చెప్పాడు.ఇంకో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే టెక్నికల్ టీం కి మంచి మార్కులు పడతాయి. పీజీ విందా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది,అలాగే చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు. అలాగే కొన్ని డైలుగులు కూడా బాగున్నాయి.నిర్మాణ విలువలు చాలా అంటే చాలా బాగున్నాయి.నిర్మాత ఖర్చుకి ఏమాత్రం వెనకాడలేదు అని సినిమాలో ప్రతి ఫ్రేమ్ కూడా చెబుతుంది.సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ చేయడం, హర్షవర్ధన్ మార్క్ బాగానే ఫలిచింది. మొత్తానికి ఇది అందరూ చూడదగ్గ సినిమా.