జగపతిబాబు ఎన్ని సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారో తెలుసా.?

Divya
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన హీరో జగపతిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ కూడా దక్కించుకున్న అతి తక్కువ మంది హీరోలలో ఈయన కూడా ఒకరు. ఈయనను నేటితరం శోభన్ బాబు అని పిలిచేవారు. అలాంటి ఇమేజ్ ను సంపాదించుకున్న ఈయన ప్రముఖ నిర్మాత రాజేంద్రప్రసాద్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా మొదటి సినిమాతోనే డిజాస్టర్ ను చవిచూశాడు.
 ఇక దాంతో హీరోగా పనికిరాడని , గొంతు చెండాలంగా ఉందని రకరకాల కామెంట్లు కూడా చేశారు. కానీ ఆ తర్వాత కాలంలో తన నటనతో అదరగొట్టి ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నారు. ఇకపోతే హీరోగా మంచి సినిమాలు చేసి భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన ఆ తర్వాత మార్కెట్ పడిపోవడంతో మళ్లీ విలన్ గా అవకాశాలను దక్కించుకున్నారు.. అలా బోయపాటి శ్రీను , బాలయ్య కాంబినేషన్లో వచ్చిన లెజెండ్ చిత్రం ద్వారా విలన్ గా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్న జగపతిబాబు.. మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక ప్రస్తుతం ఎక్కువగా విలన్ రోల్స్ చేస్తూ మోస్ట్ డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు.

ఇదిలా ఉండగా జగపతిబాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు అన్న విషయం చాలామందికి తెలియదు. అప్పట్లో జగపతిబాబు తండ్రి రాజేంద్రప్రసాద్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళంలో కూడా చేశారు.అలా ఆ రోజుల్లో తమిళ స్టార్ అయిన శివాజీ గణేషన్, జయసుధ, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన పత్తా కత్తి బైరవన్ అనే సినిమాలో బాలనటుడిగా కనిపించారు జగపతిబాబు. అంతేకాదు అంతకు ముందు తెలుగులో 1974లో విడుదలైన మంచి మనసులు చిత్రంలో కూడా బాల నటుడిగా నటించారు. ఇక అలా రెండు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన జగపతిబాబు ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టి పెద్దయ్యాక హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: