అఫీషియల్ : "కింగ్ ఆఫ్ కొత్త" మూవీ నుండి క్రేజీ అప్డేట్..!

Pulgam Srinivas
మలయాళ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో దుల్కర్ సల్మాన్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి మలయాళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడుగా కెరియర్ ను కొనసాగించడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో కూడా నటించి తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ నటుడు కింగ్ ఆఫ్ కొత్త అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించగా ... అభిలాష్ జోషి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.
 

ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే ప్రపంచ వ్యాప్తంగా మలయాళ , తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో ఈ మూవీ కూడా మంచి అంచనాల నడమ థియేటర్ లలో విడుదల అయింది . ఇలా భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను బాక్స్ ఆఫీస్ దగ్గర అలరించడం లో విఫలం అయింది . దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ఒరిజినల్ సౌండ్ స్కోర్ ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకి జాక్స్ బిజాయ్ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: