గుంటూరు కారం దెబ్బకు పాన్ ఇండియా మూవీలో మీనాక్షి చౌదరి..!!

Divya
ఇచట వాహనములు నిలపరాదు అనే చిత్రం ద్వారా మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ మీనాక్షి చౌదరి ఆ తర్వాత అడవి శేషు తో కలిసి హిట్-2 చిత్రంలో నటించింది.. ఆ తర్వాత వెంటనే మహేష్ తో కలిసి గుంటూరు కారం సినిమాలో కూడా నటించే అవకాశాన్ని అందుకుంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. మహేష్ తో అవకాశం రావడం వల్ల పలు రకాల భారీ బడ్జెట్ చిత్రాలలో నటించే అవకాశాన్ని అందుకుంటుంది.


ఇటీవలే దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఒక పాన్ ఇండియా చిత్రంలో కూడా హీరోయిన్గా నటించడానికి సిద్ధమయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు కొంత కాలం క్రితమే ప్రకటించిన ప్రస్తుతం నటీనటుల ఎంపిక మాత్రం శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైద్యాన్ని కూడా మొదట హీరోయిన్గా అనుకోగా కొన్ని కారణాల చేత నిర్మాతలు చివరికి హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఫిక్స్ చేశారట.. గతం లో కెరియర్ మొదట్లో మంచి సినిమాలలో అవకాశాలు రావడం గురించి మాట్లాడడం జరిగింది.


తన దగ్గరకు వచ్చిన కథలన్నీ వింటున్నానని కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నానని మీనాక్షి చౌదరి తెలిపింది. అయితే బిజీగా ఉండడం కోసమే కాకుండా ప్రేక్షకులను ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలని తన ఆకాంక్ష అన్నట్లుగా తెలియజేసింది. అందుకే అలాంటి పాత్రలను మాత్రమే అంగీకరించాలని తెలియజేసింది మీనాక్షి చౌదరి.. అలా ఎన్నో సినిమాలను సైతం రిజెక్ట్ చేశానని కథకు అవసరమైతేనే తప్ప ముద్దు సన్నివేశాలలో నటించానని కండిషన్ ని కూడా పెట్టుకున్నట్లు తెలియజేసింది మీనాక్షి చౌదరి. మరి పాన్ ఇండియా లెవెల్ లోనే అవకాశాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ గుంటూరు కారం సినిమా సక్సెస్ తర్వాత మరి ఏ రేంజ్ కు వెళ్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: