ఈరోజు విడుదల కాబోయే మూవీలకు సంబంధించిన క్రేజీ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవి ..? వాటికి సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ మరియు ఆ సినిమా ఎన్ని నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది అనే విషయాలను తెలుసుకుందాం.

చాంగురే బంగారు రాజా : ఈ సినిమా ఈ రోజు అనగా సెప్టెంబర్ 15 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఇకపోతే ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదల తేదీని సడన్ గా అనౌన్స్ చేసింది. దానితో ఈ మూవీ మేకర్స్ భారీ ఎత్తున ప్రమోషన్ లను నిర్వహించలేదు. అయినప్పటికీ ఈ మూవీ పై ప్రేక్షకుల్లో కాస్త మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇకపోతే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ సినిమా 2 గంటల 9 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

రామన్న యూత్ : ఈ మూవీ విడుదల తేదీని కూడా ఈ చిత్ర బృందం వారు సడన్ గా ఫిక్స్ చేశారు. ఇకపోతే ఈ సినిమా ఈ రోజు అనగా సెప్టెంబర్ 15 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 02 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మార్క్ ఆంటోనీ : తమిళ నటుడు విశాల్ హీరోగా రూపొందిన ఈ సినిమా తమిళ్ లో రూపొందింది. ఇకపోతే ఈ సినిమాని తెలుగు లో ఈ రోజు అనగా సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఎస్ జె సూర్య , సునీల్ ముఖ్య పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించగాక్... ఈ మూవీ 2 గంటల 31 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇకపోతే ఈ మూడు సినిమా లలో తమిళ డబ్బింగ్ సినిమా అయినటువంటి మార్క్ ఆంటోనీ మూవీ పైనే తెలుగు సినీ ప్రేమికుల మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: