మార్క్ ఆంటోనీ మూవీ రివ్యూ..!!

Divya
కోలీవుడ్ నటుడు విశాల్, ఎస్ జె సూర్య కలిసి నటించిన చిత్రం మార్కు ఆంటోనీ..ఎన్నో అడ్డంకులు దాటుకొని మరీ ఈ రోజున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. విశాల్ గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నారు.. మార్క్ ఆంటోని సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా ఈ సినిమా బజ్ ను బాగా పెంచేసింది. మరి ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.

మొదట మార్కు ఆంటోని చిత్రం దళపతి విజయ్ కు స్పెషల్ థాంక్స్ తో ఈ సినిమా మొదలవుతుందట. ఇక సినిమా ఎండింగ్లో అజిత్ కు స్పెషల్ థాంక్స్ చెబుతూ ఎండింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో అభిమానులు సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. మార్కు ఆంటోని చిత్రంలో సూర్య కామెడీ హైలెట్ గా ఉందని ఒంటి చేత్తో ఈ సినిమాని సైతం ముందుకు తీసుకువెళ్లాలని నేటిజన్స్  ట్విట్టర్ లో సైతం తెలియజేస్తున్నారు. విశాల్ యాక్షన్ సన్నివేశాలు విలన్ గా చేసిన సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకున్నట్లుగా తెలియజేస్తున్నారు. విశాల్, ఎస్ జె సూర్య కాంబినేషన్స్ లో వచ్చిన ప్రతి సన్నివేశం కూడా బాగా ఆకట్టుకుంటుందని తెలుపుతున్నారు.

ఈ చిత్రంలోని పాత్రలన్నిటికీ కూడా హీరో కార్తీ వాయిస్ ఇంటర్నేషన్ చేశారట. ఫస్టాఫ్ బాగా అదిరిపోయిందని చెబుతూ ఉండగా సెకండాఫ్ మరింత ఆకట్టుకుందని కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ సినిమా రూ .100 కోట్ల సినిమా అంటూ పలువురు నేటిజన్స్ సైతం ట్విట్టర్ రూపంలో పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా వరుస ప్లాపులతో సతమతమవుతున్న విశాల్ కు మార్క్ ఆంటోనీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని వినోద్ నిర్మించగా అధిక రవిచంద్రన్ తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా రీతు వర్మ, అభినయ నటించారు. మరి పూర్తి రివ్యూ కావాలి అంటే మరో కొన్ని గంటలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: