టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకున్న రష్మిక మందనా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా కొనసాగుతోంది ఈ అందాల తార. పుష్పా సినిమాతో మంచి క్రేజీ సంపాదించుకున్న ఆమె టాలీవుడ్ లోని కాకుండా బాలీవుడ్లో సైతం బిజీ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగు నుండి ఐదు సినిమాలో ఉన్నాయి. నార్త్ లో సైతం టాలీవుడ్ లో లాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది రష్మిక మందన. ఇప్పటికే బాలీవుడ్ లో రెండు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది.
అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకి అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు అని చెప్పాలి. ప్రస్తుతం రణబీర్ కపూర్ సరసన యానిమల్ అని సినిమాలో చేస్తూ బిజీగా ఉంది. దాంతోపాటు షాహిద్ కపూర్ తో సైతం మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్న వార్తలు వినబడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక మందన. ఇక వరుస సినిమాలో చేస్తూ బిజీగా ఉన్నా రష్మిక మందన సోషల్ మీడియాలో సైతం తన అభిమానులతో ఎప్పటికప్పుడు ముచ్చటిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలియజేసింది రష్మిక మందన
అవి కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే నితిన్ సినిమా నుండి తప్పకుండాట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు అని ఈ సందర్భంగా వెల్లడించింది రష్మిక మందన. అనంతరం పెళ్లెప్పుడు చేసుకుంటారు అని మరొక నెటిజన్ అడగగా.. ఇప్పుడు పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదు అని పెళ్లి చేసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది అని.. తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రేమ పెళ్లి చేసుకుంటారా లేదా పెద్దలు కుదిరిచిన పెళ్లి చేసుకుంటారా అని అడగగా అప్పటివరకు ఏదీ బెటర్ అనిపిస్తే అదే చేసుకుంటాను అంటూ ఈ సందర్భంగా వెల్లడించింది. దీంతో రష్మిక మందన చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి...!!