మరో కొత్త బ్యూటీతో ప్రేమాయణం నడుపుతున్న నాగచైతన్య.. ఎవరో తెలుసా..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా తమ కంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నాగచైతన్య సమంతల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక టాలీవుడ్ లోని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వీరు కొంతకాలం క్రితం విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరు విడాకులు తీసుకొని చాలా కాలం అవుతున్నప్పటికీ ఆ విషయం సోషల్ మీడియాలో ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ చాలా తక్కువ సమయంలోనే విడాకులు తీసుకోవడంతో రకరకాల అనుమానాలు తెరపైకి వచ్చాయి.

దాంతో ఎవరికి తోచిన కథ వాళ్ళు చెప్పుకొస్తారు. ప్రస్తుతం ఇద్దరు వాళ్ళ లైఫ్ లో హ్యాపీగా ఉన్నారు కెరియర్ పై దృష్టి పెట్టారు. అయినా జనాలు మాత్రం వాళ్ల వ్యక్తిగత జీవితాల గురించి ఆలోచించడం మాట్లాడడం మాత్రం ఆపడం లేదు. ఏదో ఒక పాత విషయాన్ని బయటకు తీస్తూ సోషల్ మీడియా ద్వారా చర్చలు జరుపుతున్నారు. ఇక వాళ్లతో ఎవరు కనిపించిన వాళ్ళు ఎవరితో తిరిగినా ఆ ఇద్దరికీ లింక్ పెట్టి చాలా రకాల వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే ఇటీవల హుషారు హీరోయిన్ దక్ష తో తిరుగుతున్నారు అని శోభిత దూళిపాలతో డేటింగ్ చేస్తున్నాడు అంటూ నాగచైతన్య పై ఒక రేంజ్ లో రూమర్స వస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

ఇక సమంతను మర్చిపోయి మళ్ళీ కొత్త ప్రేమను వెతుకుతున్నాడని స్టోరీలు కూడా పెడుతున్నారు. అయితే ఇప్పుడు నాగచైతన్య ఫాన్స్ కొంతమంది షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఫోటోలో నాగచైతన్య కార్ఫ్లో ఉన్న మరో అమ్మాయితో సెల్ఫీ దిగుతూ కనిపించారు. ఇక అది చూసిన వాళ్ళందరూ చైతన్యకు మరో అమ్మాయి దొరికింది అని డేటింగ్ చేస్తున్నాడు అంటూ కొత్త కథనాలను అల్లుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది కానీ నిజానికి ఆ ఫోటో రారండోయ్ వేడుక చూద్దాం సినిమా లోనిది. ఫోటోలో ఉన్నది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు దిగిన ఫోటో కాదు. దాంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: