స్టార్ కమెడియన్ ఇంట మోగిన పెళ్లి బాజాలు...!!
ఆయన పర్సనల్ విషయాని కి వస్తే ఆయనకు ఇద్దరు కుమారులు. ఆయన పెద్ద కొడుకు హీరో గా ఎంట్రీ ఇచ్చినప్పటికి సక్సెస్ కాలేకపోయారు. అప్పటినుంచి ఆయన బిజినెస్ పనులు చూసుకుంటున్నారు. ఐతే ఆయన చిన్నకుమారుడి పెళ్లి నిన్న హైదరాబాద్ లో జరిగింది.టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆయన చిన్న కుమారుడు సిద్ధార్థ్ వివాహం హైదరాబాద్ గచ్చిబౌలి లోని అన్వయ కన్వెన్షన్ సెంటర్ లో శుక్రవారం రాత్రి అంగ రంగ వైభవం గా జరిగింది.నగరాని కి చెందిన డా. పద్మజ వినయ్ ల కుమార్తె ఐశ్వర్య ను సిద్ధార్థ పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ , సినీ నటులు నందమూరి బాలకృష్ణ, రామ్ చరణ్ , ఉపాసన తదితరులు హాజరయ్యారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటో లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.కాగా, బ్రహ్మానందం కు ఇద్దరు కుమారులన్న విషయం తెలిసిందే. పెద్ద కుమారుడు గౌతమ్ సినిమా ల్లో నటించారు. రెండో కుమారుడు సిద్ధార్థ్ విదేశాల్లో ఉన్నత విద్య ను అభ్యసించి, అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ఇక సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఐశ్వర్య వృత్తి పరం గా డాక్టర్ అని తెలుస్తోంది.