పెళ్లయ్యాక కూడా.. ఆ హీరోపై ఇష్టాన్ని చంపుకోలేకపోతున్న కాజల్?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమంలో ఉన్న స్టార్ హీరోయిన్ లలో ఒకరుగా కొనసాగుతుంది కాజల్ అగర్వాల్. దాదాపు గత దశాబ్ద కాలానికి పైగానే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా హవా నడిపిస్తూ ఉంది అని చెప్పాలి. పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. వరసగా అవకాశాలు అందుకుంటుంది. బాలయ్య హీరోగా చేస్తున్న భగవంతు కేసరి సినిమాలో ఛాన్స్ కొట్టడంతో పాటు సత్యవతి లాంటి సినిమాల్లోనూ నటిస్తోంది. భారతీయుడు 2  సినిమాలోను చేస్తుంది. అయితే ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ ని విజయవంతంగా లీడ్ చేస్తూనే ఇక తన కెరియర్ను ఎంతో బాగా ప్లాన్ చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.


 ఇటీవల ఒక హీరో విషయంలో కాజల్ అగర్వాల్ చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయ్. ఏకంగా ఒక హీరో పై ఇష్టాన్ని చంపకోలేకపోతుందట కాజల్ అగర్వాల్.  పెళ్లయ్యాక కూడా ఇంకా ఆ హీరోతో డేట్ కి వెళ్లేందుకు కూడా రెడీ అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలాంటి మాటలు ఏకంగా ఒక స్టేజి మీద మాట్లాడటం  మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవల ఒక ఈవెంట్లో పాల్గొంది కాజల్ అగర్వాల్. ఈ క్రమంలోనే మీరు ఎవరితోనైనా డేట్ కి వెళ్లాల్సి వస్తే ఏ హీరోతో వెళ్తారు అని యాంకర్ ప్రశ్నిస్తే షాకింగ్ సమాధానం చెప్పింది  కాజల్.


 ఏ మాత్రం తడబడకుండా నాకు అలాంటి ఛాన్స్ వస్తే నాగార్జునతో డేట్ కి వెళ్తాను అంటూ టక్కున ఆన్సర్ చెప్పేసింది. అయితే కాజల్ మాట్లాడిన మాటలు ఇప్పటివి కాదు. పెళ్లి కాకముందు చేసిన కామెంట్స్. కానీ అప్పుడు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ని ఇప్పుడు వైరల్ చేస్తూ పెళ్లయ్యాక కూడా కాజల్ నాగార్జున పై ఇష్టాన్ని చంపుకోలేక పోతుంది అంటూ కొంతమంది ట్రోల్లింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఇలా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది పాత వీడియో అని తెలిసి కాజల్ అభిమానులు మాత్రం ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా గతంలో ది ఘోస్ట్ సినిమాలో నాగార్జునకి జంటగా నటించే అవకాశం వచ్చినప్పటికీ కాజల్ గర్భవతి కావడంతో ఇక ఈ సినిమా మిస్ చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: