ఆ సినిమాలో అర్ధ నగ్నంగా నటించాను.. ఆండ్రియా కామెంట్స్..!!
సైంధవ పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కిస్తూ ఉన్నారు.. అలాగే పిచాచి-2 చిత్రంతో పాటు మరొక చిత్రంలో కూడా ఆండ్రియా నటిస్తోంది. ఆండ్రియా గత చిత్రం అనిల్ మేల్ పని తుళ్ళి.. చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది..ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కించారు. ఆర్ కైసర్ ఆనంద్ దర్శకత్వం వహించారు.. ఈ చిత్రంలో ఈమె అర్థనగ్నంగా కూడా నటించిందనే విమర్శలు కూడా ఎదురయ్యాయి..అయితే ఈ విషయం పైన తాజాగా ఈ అమ్మడు స్పందించడం జరిగింది..
ఆండ్రియా మాట్లాడుతూ అవును అనిల్ మేల్ పని తుళ్ళి..చిత్రంలో నేను అర్ధ నగ్నంగా నటించాను ఆ సన్నివేశం చేసేటప్పుడు తనకు చాలా భయంగా అనిపించిందని అయినప్పటికీ అర్థం నగ్నంగా నటించడంలో తప్ప ఏమీ లేదని నా జీవితంలో అంతకంటే ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలియజేసింది ఆండ్రియా.. ప్రస్తుతం ఆండ్రియా చేసిన కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఆండ్రియా తెలుగులో కూడా తడాఖా సినిమాలో నటించింది.. ఆ తరువాత కోలీవుడ్ నుంచి డబ్బింగ్ చిత్రాలలో డిటెక్టర్ ..తదితర చిత్రాలలో కూడా నటించి మంచి పాపులారిటీ అందుకున్నది. మరి ఏ మేరకు ఈ సినిమాలతో మెప్పిస్తుందో చూడాలి మరి.