2023 లో అత్యధికంగా ఓపెనింగ్ డే రాబట్టిన చిత్రాలు ఇవే..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే అభిమానులు చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇక ముఖ్యంగా మొదటి రోజు ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి చెప్పడమే కాకుండా అత్యధికంగా ఓపెనింగ్స్ కూడా ఏ ఏ చిత్రాలు రాబట్టాయో కంపేర్ చేసి మరి తమ హీరోల గురించి పొగుడుతూ ఉంటారు.. అయితే అలా ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి విడుదలైన చిత్రాలలో ఈ ఏడాది అత్యధికంగా ఓపెనింగ్స్ డే కలెక్షన్స్ సాధించిన సినిమాల గురించి ఒకసారి తెలుసుకుందాం.


ముందుగా ప్రభాస్ నటించిన అదిపురుష్ సినిమా నీ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు.. ఈ సినిమా మొదటిరోజు ఓపెనింగ్స్ రూ .135 కోట్ల రూపాయలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక తర్వాత బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా రూ .50 కోట్ల రూపాయలు.. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకి రూ.49.5 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాకి రూ .49 కోట్లు నాని నటించిన దసరా సినిమా రూ .38 కోట్లు.. చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రానికి రూ .29 కోట్ల రూపాయలు వచ్చినట్టు తెలుస్తోంది.



అయితే ఈ ఏడాది ఇందులోనే కొన్ని చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయాయి అందులో మొదట ఆది పురుష్ సినిమా ఉండగా రెండవది బ్రో సినిమా మరొకటి చిరంజీవి నటించిన భోళా శంకర్.. ఈ చిత్రాలన్నీ కూడా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. మరి మిగిలిన నెలలో ఏ ఏ చిత్రాలు విడుదలై మరి ఈ అత్యధిక కలెక్షన్ల ఓపెనింగ్ సాధించిన సినిమాల లో హైలైట్ గా నిలుస్తాయేమో చూడాలి. స్టార్ హీరోలు సైతం తమ సినిమా షూటింగ్ లత ప్రస్తుతం బిజీగా ఉన్నారు ఈ ఏడాది దసరాకి పలు చిత్రాలు కూడా విడుదల కాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: