అలాంటి రికార్డ్ కైవసం చేసుకున్న వెంకటేష్ మూవీ అదేనా ....!

murali krishna
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచానికి పరిచయం అయింది. అత్యున్నత ఆస్కార్ బరిలోనూ మన సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే ఇండస్ట్రీకి రికార్డులు కొత్తేమి కాదని తెలుస్తోంది. గత కాలంలోనే కొన్ని తెలుగు సినిమాలు సంచలనాలు సృష్టించాయి. ఆ కాలంలోనే తక్కువ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు ఎక్కువ లాభాలు తెచ్చాయి. వాటిలో ఓ సినిమాకు దేశంలోనే అత్యధికంగా టిక్కెట్లు అమ్ముడుపోయిన రికార్డు ఉంది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ మెగాస్టార్ మూవీని తట్టుకొని మరీ అత్యధిక సెంటర్లలో ఎక్కువ రోజులు నడిచింది. ఇంతకీ ఆ సినిమా గురించి వివరాల్లోకి వెళితే..2000 సంవత్సరంలో తెలుగు సినిమాలు పోటీ పడి థియేటర్ లోకి వచ్చాయి. ఈ సమయంలో ఆడియన్స్ కు మంచి వినోదం అంటే సినిమా చూడడమే. అందుకే కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. వాటిలో 'కలిసుందాం రా' ఒకటి. విక్టరి వెంకటేష్ నటించిన ఈ మూవీ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా అలరిస్తుంది. ఆ సమయంలో వెంకీ వరుసగా ఫ్యామిలీ చిత్రాల్లో నటించడంతో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో వచ్చిన 'కలిసుందాం రా' కూడా మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది.
ఉదయ్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన 'కలిసుందాం..రా' సినిమాలో వెంకటేశ్ కు జోడిగా సిమ్రన్ నటించారు. అంతకుముందు ఈ మూవీ కోసం అంజలా జవేరి ని అనుకున్నారు. కానీ అనూహ్యంగా సిమ్రన్ కు అవకాశం ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని సిమ్రన్ ఉపయోగించుకున్నారు. ఈ సినిమాలో శ్రీహరి, రంగనాథ్, విశ్వనాథ్ శర్మ, రాళ్లపల్లి,బ్రహ్మానందం లాంటి లెజెండ్స్ నటించారు. కామెడీ, లవ్, యాక్షన్ ఇలా అన్ని కలగలిపి ఉన్న ఈ సినిమా ముందుగా 78 కేంద్రాల్లో మాత్రమే రిలీజ్ అయింది. అందుకు కారణం ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి 'అన్నయ్య' థియేటర్ లోకి రావడమే.మొదట్లో తక్కువ థియేటర్లలో రిలీజ్ అయినా ఆ తరువాత సినిమా గురించి తెలిశాక థియేటర్ల సంఖ్య పెరిగింది. అంతేకాకుండా చాలా థియేటర్లలో 50 రోజులు నడిచింది. ఇలా 14 సెంటర్లలో 175 రోజులు 4 థియేటర్లలో 200 రోజులు నడిచి రికార్డుల్లోకెక్కింది.ఇలా 200 రోజుల పాటు నడిచిన ఈ సినిమాకు మొత్తంగా 2 కోట్ల 50 వేల టిక్కెట్లు అమ్ముడు పోయాయి. ఈ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ బీట్ చేయలేదంటే మాటలు కాదు. సింపుల్ గా థియేటర్లోకి వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన ఏకైక సినిమాగా 'కలిసుందాం..రా' నిలుస్తుంది. ఇక ఈ సినిమాను రూ.4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. రూ.25 కోట్లు గ్రాస్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: