ఐపీఎల్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్లు ఇవే..!

Pulgam Srinivas
ఐ పీ ఎల్ టోర్నీ అంటేనే అత్యధిక స్కోర్లు వస్తూ ఉంటాయి. దానితో ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్ లను చూస్తూ ఉంటారు. ఇక ఐ పీ ఎల్ టోర్నీలలో భారీ సిక్స్ లు కూడా అధికంగానే వస్తూ ఉంటాయి. చాలా మంది ఆటగాళ్లు ఈ టోర్నీలో అదిరిపోయే రేంజ్ సిక్సర్ కొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే ఇప్పటి వరకు ఏ జట్టు ఐ పి ఎల్ సీజన్ లలో అత్యధిక సిక్సర్ లను సాధించింది అనే విషయాలను క్లియర్ గా తెలుసుకుందాం.

సన్రైజర్స్ హైదరాబాద్ : ఈ జట్టు 2024 సీజన్ లో ఇప్పటికే 160 సిక్స్ లను కొట్టి ఇప్పటివరకు ఏ ఐ పీ ఎల్ సీజన్ లలో ఎవరు కొట్టని సిక్స్ లను సాధించింది. ఈ జట్టు ఈ సారి ప్లే ఆప్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ జట్టు పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉండడంతో మరో రెండు మ్యాచ్ లను ఈ సీజన్ లో కచ్చితంగా ఆడుతుంది. దానితో ఈ సీజన్ లో ఈ జట్టు మరిన్ని సిక్స్ లను సాధించే అవకాశం ఉంది. దానితో ఈ జట్టు ఐ పి ఎల్ టోర్నీ లో అత్యధిక సిక్సర్లను కొట్టిన జాబితాలో మరింత ముందుకు దూసుకెళ్లి వెళ్లే అవకాశం ఉంది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు : ఈ జట్టు కూడా 2024 సీజన్లోనే 157 సిక్సర్లను సాధించింది. ఈ జట్టు కూడా ప్లే ఆప్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దానితో ఈ జట్టు ఒకటి లేదా రెండు మ్యాచ్ లాంజ్ ఇంకా ఈ సీజన్ లో ఆడే అవకాశాలు ఉన్నాయి. దానితో ఈ జట్టు కూడా మరిన్ని సిక్సర్లను ఈ టోర్నీలో అందుకోబోయే అవకాశాలు ఉన్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ : ఈ జట్టు 2018 టోర్నీ లో 145 సిక్సర్ లను సాధించింది.

కోల్కతా నైట్ రైడర్స్ : ఈ జట్టు 2019 టోర్నీ లో 143 సిక్సర్లను సాధించింది.

ఇలా ఒకే సీజన్ లో అత్యధిక సిక్స్ లను సాధించిన టాప్ 4 ప్లేస్ లలో ఈ నాలుగు జట్లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: