దేవర ఫస్ట్ సాంగ్ కాపీ.. దొరికిపోయిన అనిరుధ్?

Purushottham Vinay
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ తాజాగా విడుదలైంది.  ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాగా ఈ పాట వింటే ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు.అంతేగాక ఈ సాంగ్ అటు ఎన్టీఆర్ కెరీర్ లో ఇటు అనిరుధ్ కెరీర్ లో బెస్ట్ సాంగ్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పైగా ఈ సాంగ్ కు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండగా ఈ సాంగ్ హాలీవుడ్ స్థాయిలో ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 3 నిమిషాల 16 సెకన్ల నిడివితో ఈ సాంగ్ రిలీజ్ కాగా ఎన్టీఆర్ రెగ్యులర్ సినిమాల సాంగ్స్ కు భిన్నంగా ఈ పాట ఉండటం గమనార్హం. పాన్ ఇండియా స్థాయిలో ఈ పాట ఫ్యాన్స్ ను, ఇతర భాషల అభిమానులను కూడా మెప్పించడం ఖాయమని మ్యూజిక్ లవర్స్ చెబుతున్నారు.ఈ పాట అటు మాస్ ప్రేక్షకులతో పాటు ఇటు క్లాస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటోంది. ఈ జనరేషన్ యూత్ ను టార్గెట్ చేసుకుని అనిరుధ్ రవిచందర్ ఈ సాంగ్ కు మ్యూజిక్ ఇచ్చారని కామెంట్లు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి.


కొన్నిచోట్ల లిరిక్స్ ను మ్యూజిక్ డామినేట్ చేసిందనే ఫీల్ వస్తున్నా ఓవరాల్ గా సాంగ్ మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంచనాలను మించి ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ సాంగ్ లియో సినిమాలో బ్యాడ్ యాస్ పాట లాగా ఉండంటూ తమిళ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మళ్ళీ అనిరుధ్ కాపీ కొట్టాడంటూ తమిళ  ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సాంగ్ అయితే యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. తెలుగులో ఇలాంటి సాంగ్స్ మరిన్ని రావాలని తెలుగు అభిమానులు భావిస్తున్నారు.దేవర  దసరా పండుగ కానుకగా రిలీజ్ కానుండగా త్వరలో ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ గా రొమాంటిక్ సాంగ్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్స్ నుంచి ఎలాంటి అప్ డేట్స్ వస్తాయో చూడాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ బర్త్ డే మెమరబుల్ అప్ డేట్స్ తో స్పెషల్ గా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: