రెమ్యూనరేషన్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న బాలయ్య..!?

Anilkumar
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాలయ్య రెమ్యూనరేషన్ విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు చాలామంది. ఇక స్టార్ హీరో బాలయ్య సినిమా థియేటర్ హక్కులు 80 కోట్ల రూపాయలకు అటు ఇటుగా అమ్ముడుపోతాయి. నాన్ హీట్రికల్ హక్కులు 60 నుండి 70 కోట్ల రూపాయలకు అమ్మడవుతాయి. అయితే ఇప్పటివరకు బాలకృష్ణ తీసుకున్న హైయెస్ట్ రెమ్యూనరేషన్ 18 కోట్లు మాత్రమే అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. 


అయితే సినిమాల మార్కెట్ పెరిగిన స్థాయిలో బడ్జెట్ పెరగకుండా నటసింహం నందమూరి బాలకృష్ణ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారట. ఈ విధంగా చేయడం వల్ల బాలకృష్ణ సినిమాలు హిట్ టాక్ వస్తే భారీ స్థాయిలో లాభాలు వస్తుండగా యావరేజ్ స్టాకు వచ్చినప్పటికీ నిర్మాతలకు నష్టాలు రాకుండా జాగ్రత్త తీసుకుంటున్నాడట బాలకృష్ణ. ఇక ఈ విషయంలో బాలయ్యకు సాటి లేరు అని తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు నందమూరి అభిమానులు. ఇదిలా ఉంటే ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ  ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో 


కూడా పాల్గొనబోతున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ . తమన్ బాలయ్య కోసం ఒక స్పెషల్ సాంగ్ సిద్ధం చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే బాలయ్య ఒక సినిమా షూటింగ్ పూర్తవ్వకముందే మరొక సినిమాను ప్రకటిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే బాలయ్య మరియు బాబీ కాంబినేషన్లో నటించే హీరోయిన్లకు సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో మూవీ మంచి విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నారు వీరిద్దరి అభిమానులు. దీంతో నటసింహం నందమూరి బాలకృష్ణ కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: