LGM: ధోని మొదటి సినిమా వచ్చేది అప్పుడే..?

Divya
మహేంద్ర సింగ్ ధోని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రొడ్యూసర్ గా మొదటి సినిమా కోలీవుడ్ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.. ఆ చిత్రమే LGM. ఈ చిత్రాన్ని ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తన భార్య సాక్షి సింగ్ నిర్మిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైమెంట్ చిత్రంగా తెరకెక్కించారు ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. ఈ సినిమా ఒక ఇండిపెండెంట్ అమ్మాయి ప్రేమలో పడితే ఆ తర్వాత ఆ అబ్బాయి కుటుంబంతో ఉండడానికి ఇష్టపడకపోవడం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించారు.


ఆ తరువాత వీరి మధ్య బాండింగ్ పెంచుకోవడానికి ఫ్యామిలీ ట్రిప్స్ వంటివి ప్లాన్ చేస్తూ ఉండగా వీరందరి మధ్య జరిగేటటువంటి ఫన్నీ సన్నివేశారులను తెరకెక్కించడం జరిగింది డైరెక్టర్ రమేష్ తమిళమని దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా బాగానే చేసినట్లు తెలుస్తోంది.. లెట్స్ గెట్ మ్యారేజ్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా లో హీరోగా హరీష్ కళ్యాణ్ హీరోయిన్గా ఇవానా నటించింది. ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమా సక్సెస్ అయితే ధోని నెక్స్ట్ సినిమాలు కొనసాగించే అవకాశం ఉంటుంది అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేయడం జరిగింది తమిళంలో ఏ సినిమా గత నెల 28వ తేదీన విడుదలై పాజిటివ్ టాక్ తో నడుస్తోంది తెలుగులో రిలీజ్ డేట్ ని ఆగస్టు 4 వ తేదీకి పోస్ట్ పోన్ చేసినట్లుగా తెలుస్తోంది. ధోనికి యూత్లో మంచి క్రేజ్ ఉన్నది ఈ క్రేజీతోనే తను LGM చిత్రంతో మంచి ఓపెనింగ్స్ కూడా రాబట్టుకున్నారు. నదియా ఈ సినిమాలోని తల్లి పాత్రలు నటించింది ఈమె పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: