కల్కి 2898 ఏడీ: జాగ్రత్తలు తీసుకుంటున్న డైరెక్టర్?

Purushottham Vinay
అద్భుతమైన గ్లింప్స్ చూసినప్పటి నుంచి 'కల్కి 2898 ఏడీ' సినిమా ఎప్పుడు రిలీజవుతుందంటూ రెబల్ స్టార్ అభిమానులతో పాటు ఇండియన్ అభిమానులు కూడా వేయకళ్లతో ఎదురుచూస్తున్న తరుణంలో మూవీ మేకర్స్ ఒక నిర్ణయానికి వచ్చారు.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ వరల్డ్ మూవీ ఈ 'కల్కి 2898 ఏడీ'. వైజయంతి మూవీస్ బ్యానర్లో రూపొందుతున్న ఈ మూవీకి 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో చాలా భారీ అంచనాలే ఉన్నాయి. ప్రభాస్, దీపికా పదుకుణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇంకా దిశా పటానీ లాంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి పెంచారు. ఇప్పటికే కామిక్ కాన్ వేదికగా రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో ఇప్పటికే దేశ విదేశాల్లో ఎన్నో రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ లుక్స్తో పాటు పలు అంశాలను షూట్ చేసిన తీరు ఆడియెన్స్ను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అంటూ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణంలో మూవీ యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చింది.ఈ మూవీని అనుకున్న సమయం కంటే ఇంకా ఆలస్యంగానే రిలీజ్ చేస్తారనే టాక్ నెట్టింట తెగ వినిపిస్తోంది. అయితే దానికి ఓ రీజన్ ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ చెందకుండా చాలా గ్రాండ్ గా గ్రాఫిక్స్ సెట్ చెయ్యాలని ప్లాన్ చెయ్యాలని నాగ్ అశ్విన్ కంకణం కట్టుకున్నాడట. ఎందుకంటే గ్లింప్స్ కి వచ్చిన రెస్పాన్స్ కి ఎక్కడ తగ్గకుండా పర్ఫెక్ట్ గా ప్రతీది జాగ్రత్తగా చూసుకుంటున్నారట. సో అందువల్ల మూవీ రిలీజ్ లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎంత లేట్ అయిన గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ని నిరాశ పరచకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.ఇక అప్పట్లో ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఇంకా ఈ క్రమంలో అనుకున్న తేదీ కంటే మరో నాలుగు నెలలకు పోస్ట్ పోన్ చేయాలని చూస్తున్నారట. అందుకే జనవరి నెలలో కాకుండా ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. విడుదల తేదీ కూడా మే 9గా ఫిక్స్ చేసినట్లు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: