కరోనా తర్వాత ఆ రేర్ ఫీట్ను సాధించిన మూవీల లిస్టులో "బేబీ"..!

Pulgam Srinivas
కరోనా.తర్వాత విడుదల అయిన సినిమాలలో కొన్ని సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా రోజుల పాటు వరుసగా ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో బేబీ మూవీ కూడా అద్భుతమైన స్థానాన్ని దక్కించుకుంది. ఇకపోతే కరోనా తర్వాత విడుదల అయిన సినిమాలలో వరసగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 17 రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ వసూలు చేసి "ఆర్ ఆర్ ఆర్" మూవీ మొదటి స్థానంలో నిలవగా ... ఆ తర్వాత జాతి రత్నాలు మూవీ 12 రోజులు వరసగా ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది.

అలాగే కన్నడ డబ్బింగ్ సినిమా అయినటు వంటి "కే జీ ఎఫ్ చాప్టర్ 2" మూవీ 12 రోజుల పాటు వరుసగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. అలాగే రవితేజ హీరోగా రూపొందిన ధమాకా సినిమా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో వరసగా 12 రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా 12 రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఆనంద్ దేవరకొండ ... విరాజ్ ... వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కూడా వరుసగా 12 రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లాంజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టి ఈ మూవీ ల లిస్టులో చేరిపోయింది. ఇలా ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: