వర్మ వ్యూహంలో పవన్ కళ్యాణ్ !

Seetha Sailaja
పవన్ కల్యాణ్  రామ్  గోపాల్ వర్మల  మధ్య  వైరం కొత్తది కాదు. అవకాశం  దొరికినప్పుడల్లా వర్మ తన కామెంట్స్ తో పవన్ ను ఒక ఆటాడుకుంటాడడు. కేవలం విమర్శలతో సారి పెట్టడమే కాకుండా పవన్ ను టార్గెట్ చేస్తూ సినిమాలు కూడా  తీసిన ట్రాక్ రికార్డు వర్మకు ఉంది. వాస్తవానికి వర్మకు పవన్ పై ఇంత  దురాభిమానం ఎందుకు ఏర్పడిందో ఎవరకి తెలియని విషయం.  

ప్రస్తుతం వర్మ రాబోయే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహం  అన్న సినిమాను  తీస్తున్న విషయం తెలిసిందే. ఈమూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం  అయిందో  ఎవరికి  క్లారిటీ లేకపోయినా వర్మ ఈ మూవీ షూటింగ్  ఇప్పటికే పూర్తి చేశాడు అన్నవార్తలు ఉన్నాయి. లేటెస్ట్ గా వర్మ తన ట్విట్టర్ ఖాతాలో తన సినిమాలోని పవన్  పాత్రకు  సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ ఈ క్యారెక్టర్ గురించి మీరేం అనుకుంటున్నారంటూ పోస్టు పెట్టాడు.

దీనితో వర్మ ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ను మరొకసారి ఘాటుగా టార్గెట్ చేయబోతున్నాడు అన్నసంకేతాలు వస్తున్నాయి. తన తండ్రి ఆకస్మికంగా మరణించిన తరువాత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఎలా కొనసాగింది తన ప్రత్యర్థులను ఎయిరించి జగన్ ఏవిధంగా ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు అన్న విషయాలను ఈ సినిమాలో వర్మ చూపెడతాడు అని తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ నుంచి అదేవిధంగా ‘జనసేన’  నుంచి ఎదురైన విమర్శలు తట్టుకుని జగన్ ఏవిధంగా తన లక్ష్యం వైపు అడుగులు వేశారు అన్నవిషయం ఈ మూవీలో వర్మ చూపెడతాడు అని అంటున్నారు. ఎర్ర కండువా మెడలో వేసుకొని నేలపై పడుకొని గాల్లో లెక్కలు వేస్తున్నట్టు పవన్ కల్యాణ్ పాత్రకు సంబంధించిన లుక్ కు సంబంధించిన ఫోటోను వర్మ షేర్ చేయడంతో ఆ ఫోటో క్షణాలలో వైరల్ గా మారింది. ఈ ఫోటోను బట్టి చూస్తుంటే వర్మ మరో వివాదాస్పద సినిమాకు రంగం సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: