భర్త గూర్చి అలా కామెంట్స్ చేసిన సీనియర్ నటి సంగీత...!!
దీని నుంచి బయటపడాలని నా ప్రయత్నాలు నేను చేశానని సంగీత చెప్పుకొచ్చారు. త్వరగా పెళ్లి జీవితానికి దూరమవుదామని భావించానని ఆమె పేర్కొన్నారు. కెరీర్ తొలినాళ్లలో పరిస్థితులు దారుణంగా ఉండేవని సంగీత చెప్పుకొచ్చారు. మేము ప్రేమించి పెళ్లి చేసుకోవడం తో భర్త కుటుంబం నుంచి ఒత్తిడి, గొడవలు జరిగాయని ఆమె కామెంట్లు చేశారు. ఫలితంగా వాళ్లకు దూరం కావాల్సి వచ్చిందని అదే సమయంలో తొందరపడి పెళ్లి చేసుకున్నానా అని అనిపించిందని సంగీత వెల్లడించారు.తెలిసో తెలియకో ఒక నిర్ణయం తీసుకున్నానని అది రైటా రాంగా అనేది నాకు తెలియదని అయితే సరి చేయాల్సిన బాధ్యత మాత్రం నాపై ఉందని సంగీత పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలా? ఈ సమస్య నుంచి బయటకొచ్చేయాలా? అని అనిపించిందని ఆమె చెప్పుకొచ్చారు. నా ముందు ఆ సమయం లో రెండే ఆప్షన్లు కనిపించగా మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుని బాగా నమ్మకం ఏర్పరచుకున్నామని సంగీత వెల్లడించారు.
నా భర్త అమేజింగ్ పర్సన్ అని సంగీత పేర్కొన్నారు. నా భర్త కు నన్ను వదులుకోవడం అస్సలు ఇష్టం లేదని సంగీత అన్నారు. నన్ను వదిలేయొద్దని లైఫ్ చాలా చిన్నదని ఇష్టమైన వాళ్లు కొందరే ఉంటారని వాళ్లను వదులుకోవద్దని నా భర్త చెప్పారని సంగీత పేర్కొన్నారు.