ఆవిషయంలో బ్రో కు ఎదురీత !
దీనితో పవన్ కళ్యాణ్ తో సినిమాలు తీసే నిర్మాతలు తమ సినిమాను భారీ మొత్తాలకు అమ్మవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈమధ్యకాలంలో పవన్ నుండి వచ్చిన ‘వకీల్ సాబ్’ ‘భీమ్లా నాయక్’ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ ఆతరువాత కొద్దిరోజులకే ఆసినిమాల కలక్షన్స్ డల్ అవ్వడంతో ఆమూవీలను కొనుక్కున్న కొంతమంది బయ్యర్లకు నష్టం వచ్చింది అన్న ప్రచారం జరిగింది.
అయితే పవన్ కళ్యాణ్ సినిమాలను కొనుక్కున్న బయ్యర్లు తమకు నష్టం వచ్చింది అని ఓపెన్ గా చెప్పడానికి ఇష్టపడరు అని అంటారు. దీనికి కారణాం ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న పట్టురీత్యా భవిష్యత్ లో మరియే మెగా హీరో భారీ సినిమాలను కొనే అవకాశం ఉండదని పవన్ సినిమాల విషయంలో చాల గుంభనంగా ఉంటారు అన్నప్రచారం ఉంది ఈవిషయం పై వాస్తవాలు చాల కొద్దిమందికే తెలుసు.
ఇప్పుడు పవన్ సాయి ధరమ్ తేజ్ లతో ‘బ్రో’ సినిమా తీసిన నిర్మాతలకు ఆమూవీ బడ్జెట్ విపరీతంగా పెరిగి పోవడంతో ఆమూవీ బిజినెస్ కు సంబంధించి నిర్మాతలు బయ్యర్లకు చెపుతున్న ఏరియా రేట్లు విని కొందరు షాక్ అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈమూవీ విడుదలకు కొన్నిరోజులు మాత్రమే మిగిలిన పరిస్థితులలో ఈమూవీ బిజినెస్ నిర్మాతల అంచనాలకు అనుగుణంగా జరగలేదు అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను చూసి కొందరు షాక్ అవుతున్నట్లు సమాచారం. అయితే ఇవి అన్నీ పవన్ అంటే ఇష్టంలేని ఒక వర్గం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు మాత్రమే అంటూ కామెంట్స్ చేస్తున్నట్లు టాక్..