సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న అనుష్క.. పెళ్లి కోసమేనా?

praveen
టాలీవుడ్లో సీనియర్ హీరోయిన్గా కొనసాగుతున్న అనుష్క గురించి అటు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. సూపర్ అనే సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాదు స్టార్ హీరోయిన్గా హవా నడిపించింది అని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అందరూ స్టార్ హీరోల సరసన నటించి పర్ఫెక్ట్ జోడీగా పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.


 ఇక ఇప్పుడు లేడి ఓరియంటెడ్ సినిమాలు చేయడమే కాదు ఇక కథ బలంగా ఉన్న సినిమా అవకాశాలు వస్తే చేస్తూ ఉంది అని చెప్పాలి. అయితే అనుష్క తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన ఎంతో మంది హీరోయిన్లు ఇక పెళ్లి చేసుకొని ఓ ఇంటి కోడలిగా మారారు. కానీ ఇప్పటివరకు సీనియర్ హీరోయిన్ అనుష్క మాత్రం పెళ్లి ఊసే ఎత్తడం లేదు. అనుష్క పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఎప్పుడూ ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయ్ అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.


 ప్రస్తుతం అనుష్క యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమాలో నటిస్తోంది  ఇక ఈ సినిమాకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అని టైటిల్ ఫిక్స్ చేసారు. అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందట ఈ ముద్దుగుమ్మ. ఎందుకంటే పెళ్లి విషయంపై అనుష్కకు తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి ఎక్కువైందట. ఇప్పటికే 40 ఏళ్ళు దాటిపోయాయి. ఇంకా పెళ్లి చేసుకోక పోతే కుటుంబంలో మేం తలెత్తుకొని తిరగలేకపోతున్నాం. ముందు నువ్వు పెళ్లి చేసుకో అంటూ అనుష్క శెట్టిని పెళ్లికి ఒప్పించారట తల్లిదండ్రులు. దీంతో ఇక తల్లిదండ్రులు చెప్పినట్లుగానే అనుష్క పెళ్లికి సిద్ధమైపోయిందట. ఈ విషయాన్ని ప్రభాస్ అభిమానులు మాత్రం జీవించుకోలేకపోతున్నారు. కారణం ప్రభాస్ అనుష్క ప్రేమలో కొనసాగుతున్నారని ఎన్నో రోజులుగా టాలీవుడ్లో ప్రచారం ఉంది అని విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: