హిందీలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 6 సౌత్ మూవీస్ ఇవే..!

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన సినిమాలు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీ నుండి విడుదల అయ్యి హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 6 మూవీ స్ ఏవో తెలుసుకుందాం.

బాహుబలి 2 : ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 511 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా నటించగా ... విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథను అందించాడు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు.

కే జి ఎఫ్ 2 : యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 435.2 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఆర్ ఆర్ ఆర్ : రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 276.8 కోట్ల కలెక్షన్ లను చేసింది.

రోబో 2.0 : సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 189 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సాహో : ప్రభాస్ హీరో గా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 150.6 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

ఆది పురుష్ : ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 143.25 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: