కోలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌లలో అజిత్ కుమార్ కూడా ఒకరు. సూపర్‌హిట్ చిత్రాలతో కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ కింగ్ అయినప్పటికీ, చిత్రపరిశ్రమలో ఆయన ఎంతో వినయపూర్వకంగా ఉంటూ డౌన్ టు ఎర్త్‌గా మంచి పేరు పొందాడు.అయితే, అజిత్ అలాంటివాడేమి కాదంటూ ప్రముఖ నిర్మాత మాణికం నారాయణన్ ఆరోపిస్తున్నాడు. తన వద్ద డబ్బు తీసుకుని ఇప్పటికి కూడా తిరిగి ఇవ్వలేదని, అతనో మోసగాడని ఆ నిర్మాత ఆరోపించాడు.నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ అజిత్ కుమార్ తనను మోసం చేశారని బాగా మండిపడ్డారు. 'అజిత్ తన తల్లిదండ్రులను సెలవుపై మలేషియాకు పంపాలని చాలా సంవత్సరాల క్రితం నా నుంచి డబ్బుని తీసుకున్నాడు. అప్పట్లో అతను నాకు ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. రెమ్యునరేషన్‌లో ఆ డబ్బును సర్దుబాటు చేస్తానని కూడా మాట ఇచ్చాడు. అయితే, ఈ రోజు దాకా కూడా అతను డబ్బు తిరిగి ఇవ్వలేదు.ఇంకా అంతే కాకుండా నాకు సినిమా కూడా చేయలేదు. ఇన్నేళ్లలో అతను దీని గురించే మాట్లాడటమే మానేశాడు.
అతను తనను తాను ఓ పెద్దమనిషిగా అనకుంటాడు కానీ అది నిజం కాదు.' అని చెప్పుకొచ్చాడు.ఇప్పుడు అజిత్ టాప్ హీరో. అతను ప్రతి చిత్రానికి రూ. 50కోట్లకు పైగానే సంపాదిస్తున్నాడు. కాబట్టి తనకు రావాల్సిన డబ్బు చెల్లించవచ్చు కదా అని నిర్మాత మాణికం అజిత్ పై ఫైర్ అవుతున్నాడు. ఇంకా తనతో పాటు ఏఎమ్ రత్నం వంటి నిర్మాతలు కూడా అజిత్ చిత్రాలను నిర్మించడంతో భారీగా నష్టాలను చవిచూశామని, అసలు ఇప్పటి దాకా నష్టపోయిన నిర్మాతలకు సహాయం కూడా చేయలేదని ఆయన పంచుకున్నారు.ఇక హీరో అజిత్‌కు 1996లో మొదట రూ.6లక్షలు, 1998లో మరోసారి రూ.12 లక్షలు ఇచ్చానని ఆ నిర్మాత మాణికం నారాయణన్ గతంలోనే ఆరోపించారు. తాజాగా ఇదే అంశాన్ని మళ్లీ అతను తెరపైకి తెచ్చాడు. గతంలో వీరిద్దరి మధ్య చాలా మంచి స్నేహం ఉండేది. నిర్మాత మాణికం కుతురు పెళ్లికి కొన్ని కారణాల వల్ల అజిత్ కుమార్ రాలేదని అందుకే ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడని అజిత్ ఫ్యాన్స్ ఆ నిర్మాత పై ఫైర్ అవుతున్నారు.