పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన rrr మూవీ ప్రపంచవ్యాప్తగా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన ఈ సినిమాకు ప్రపంచమంతా కూడా ఎంతగానో ఫిదా అయిపోయింది. ఆస్కార్ రేంజ్ లో కూడా సత్తా చాటిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ.1200 కోట్ల పైగా కలెక్షన్స్ కలెక్ట్ చేసింది.ఆర్ ఆర్ ఆర్ సినిమా గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కూడా ప్రకటించారు ఆ మూవీ మేకర్స్. అయితే సినిమా రిలీజ్ తరువాత కొంతకాలానికి రాజమౌళి సీక్వెల్ వార్తలపై స్పందిస్తూ.. మళ్ళీ అలాంటి పవర్ ఫుల్ లైన్, పవర్ ఫుల్ ఎమోషన్ సెట్ అయితే తప్పకుండా సీక్వెల్ చేస్తామని ప్రకటించడం జరిగింది.ఆర్ ఆర్ ఆర్ సినిమా సీక్వెల్ పై తాజాగా ఆ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ క్లారిటీని ఇచ్చారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్ పై ప్లాన్స్ ఉన్నాయని, ఇందులో కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తారని, కాకపోతే ఈసారి ఆర్.ఆర్.ఆర్ సినిమాను హాలీవుడ్ లో తెరకెక్కిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.ఆర్ ఆర్ ఆర్ సినిమా సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్.. దర్శకుడి విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ లో పడేశారు.ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేయకపోవచ్చని,అతని పర్యవేక్షణలో వేరే దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని చెప్పుకొచ్చారు. ఈ డైరెక్టర్స్ లిస్టులో హాలీవుడ్ డైరెక్టర్ స్పీల్ బర్గ్ పేరు చాలా ఎక్కువగా వినిపిస్తోంది.ఇక ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్ ను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట స్పీల్ బర్గ్. ఆ మధ్య ఆస్కార్ వేడుకల్లో కూడా రాజమౌళితో ఆర్.ఆర్.ఆర్ సినిమా గురించి ముచ్చటించారు స్పీల్ బర్గ్. దీంతో ఈ సినిమాను ఆయన డైరెక్ట్ చేయనున్నాడనే వార్తలు చాలా బలంగా వినిపిస్తన్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చే దాకా వెయిట్ చెయ్యాల్సిందే.