SSMB -29 సినిమా ఎక్కడిదాకా వచ్చిందంటే..?
ఇతర దేశాలలో కూడా రాజమౌళి సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గత కొంతకాలంగా ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా కీరవాణి కొడుకు శ్రీ సింహ మాట్లాడుతూ ఈ సినిమా పైన మరో అప్డేట్ ఇవ్వడం జరిగింది.. మహేష్ రాజమౌళి సినిమా గురించి ఇంట్లో అందరూ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నామని ఈ సినిమా కోసం పని చేసేందుకు ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నామని తెలియజేశారు.
ఇకపోతే ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతుందని సమాచారం. సినిమా అయిపోయిన వెంటనే ఈ సినిమాని మొదలుపెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఈ ఏడాది చివరిలో లేకపోతే వచ్చే ఏడాది జనవరి కల్లా ఈ సినిమాని మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా మహేష్ అభిమానులను తెగ ఉర్రూతలూగిస్తున్న ఈ సినిమా ఏమేరకు రికార్డులు సైతం సృష్టిస్తుందో చూడాలి మరి. మహేష్ అందుకోసమే చాలా స్టైలిష్ లుక్ లో ఈ మధ్యకాలంలో వరుస ఫోటోలను సైతం విడుదల చేస్తూ తెగ వైరల్ గా మారుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.