బాలకృష్ణ కెరియర్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 3 మూవీలు ఇవే..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఇప్పటి వరకు ఎన్నో పవర్ఫుల్ బ్లాక్ బాస్టర్ సినిమా లలో హీరోగా నటించి ఇప్పటికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 3 మూవీ లు ఏవో తెలుసుకుందాం.
వీర సింహా రెడ్డి : బాలకృష్ణ హీరో గా రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. హనీ రోజ్ ఈ మూవీ లో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించి రెండు పాత్రలో కూడా తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ కి తమన్ సంగీతం అందించగా ... వరలక్ష్మి శరత్ కుమార్ ... దునియా విజయ్ మూవీ లో విలన్ పాత్రలలో నటించారు. ఈ మూవీ 127 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.
అఖండ : బాలకృష్ణ హీరోగా రూపొందిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ లో పూర్ణ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... శ్రీకాంత్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ 125 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
గౌతమీపుత్ర శాతకర్ణి : బాలకృష్ణ హీరోగా రూపొందిన ఈ సినిమాలో శ్రేయ హీరోయిన్ గా నటించగా క్రిష్ జాగర్లమూడి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 80 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి చిరంతన్ బట్ సంగీతం అందించాడు.
ఈ మూడు మూవీ లు బాలకృష్ణ కెరియర్ లో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 3 మూవీ ల లిస్ట్ లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: