మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వాల్తేరు వీరయ్య మూవీ తో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా వాల్టేరు వీరయ్య మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మెహర్ రమేష్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఏకే ఎటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో కీర్తి సురేష్ ... సుశాంత్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.
మహతి స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతం అందిస్తూ ఉండగా ... యాంకర్ కం నటి అయినటువంటి శ్రీ ముఖి మూవీ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతునట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తి అయినట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తి అయినట్లు తాజాగా ప్రకటిస్తూ కొన్ని ఫోటోలు కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ బృందం విడుదల చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత చిరంజీవి నుండి రాబోతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల్లో కూడా భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి.