అలా ఎందుకు చేసానో చెప్పిన తమన్నా...!!

murali krishna
స్టార్ హిరోయిన్ తమన్న గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆమె చేసిన బాహుబలి మూవీ ఆమెను పాన్ ఇండియా లెవెల్ లో పేరు తెచ్చి పెట్టింది. ఐతే ప్రెసెంట్ ఆమె పేరు సోషల్ మీడియాలో హట్ టాపిగ్‌గా మారిపోయింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటిస్తూ మంచి నటిగా గర్తింపు తెచ్చుకున్న ఈ మిల్కీబ్యూటీ తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో జైలర్ అనే లో నటించింది.ఈ ఆగస్టు 10న విడుదల కానుంది. అలాగే ఇటీవల తమన్నా తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ గురించి బహిరంగంగా చెప్పడం చర్చనీయాంశమైంది. ఆమె ప్రస్తుతం నటిస్తున్న జీ కర్దా వెబ్ సిరీస్‌లో లిప్‌లాక్‌లు, బెడ్‌రూం సన్నివేశాలపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో ఆమె ఎప్పుడూ కూడా లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించను అని చెప్పేసింది. కానీ ఇప్పుడు హద్దు మీరి బోల్డ్ సన్నివేశాలు నటిస్తోందంటూ పలువురు నెటిజన్లు కామెంట్ల చేస్తు్న్న పరిస్థతి కూడా నెలకొంది.
అయితే ఈ విషయంపై తమన్న ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. తను చేసిన బోల్డ్ సన్నివేశాలపై విమర్శలు వస్తున్నాయని చెప్పింది. ఆ వెబ్‌సిరీస్ కథకు ఆ సన్నివేశాలు అవసరం అని అనిపించడంతోనే అలా నటించానని స్పష్టం చేసింది. 2023లో కూడా ఇంకా బెడ్‌రూం సీన్ల గురించి విమర్శల చేయడం ఏంటని ప్రశ్నించింది. దీనికి సంబంధించి మొదట్లో నేను తెగ అసహనానికి గురి అయ్యేదాన్ని కానీ ఇపుడు అలాంటి విమర్శలు పట్టించుకోవడం మానేసాను అంటుంది. ఐతే ఇప్పటిదాక పెళ్లి చేసుకోలేదని విమర్శించిన వాళ్లు తన బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పడంతో ప్రస్తుతం దీనిపై కూడా విమర్శలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది.ఏదేమైనా ఈ రకంగా ఇబ్బంది పెట్టడం పై తమన్నా బాధపడుతుందనే చెప్పాలి.దీనిపై ఆమె అభిమానులు ఎవరేమనుకున్న తమన్నా చెప్పిన సమాధానం అనేది ఆమె అభిమానులుకి ఆనందాన్ని కల్గించింది.ఐతే ఇకపై ఆమె చేసే మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాము అంటున్నారు ఆమె అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: