సామజవరగమనా: అంతా సూపర్ కానీ ఆ ఒక్కటి మైనస్?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు క్యారక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత హీరో గా రాణిస్తూ చాలా సినిమాల్లో నటించినా కానీ సక్సెస్ రేట్ మాత్రం ఇతనికి చాలా తక్కువే, కానీ ఇతని సినిమాలు ఓటీటీ లో మాత్రం మంచి ఆధరణని దక్కించుకుంటాయి. కమర్షియల్ గా మాత్రం ఇప్పటి దాకా ఈయన చేసిన సినిమాలలో 'బ్రోచేవారెవరురా' ఇంకా 'రాజా రాజా చోర' వంటి సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఇప్పుడు అతను వరుస ఫ్లాప్ సినిమాల తర్వాత నేడు 'సామజవరగమనా' సినిమాతో మన ముందుకి వచ్చాడు. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా , సినిమా పరంగా కూడా అదే రేంజ్ లో అలరించిందో లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఒక సింపుల్ పాయింట్ మీద రెండు గంటల సినిమాని ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా తియ్యడం అనేది మామూలు విషయం కాదు. ఒక దర్శకుడి ప్రతిభ ఇలాంటి సమయాల్లోనే తెలుస్తుంది.



ఈ సినిమా దర్శకుడు కూడా అదే నిరూపించుకున్నాడు.అయితే ఫస్ట్ హాఫ్ తో పోల్చి చూస్తే సెకండ్ హాఫ్ కాస్త తగ్గింది కానీ, ఎక్కడా కూడా అస్సలు బోర్ కొట్టదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో  వెన్నెల కిషోర్ కామెడీ అయితే బాగా వర్కౌట్ అయ్యింది.ఇక నరేష్ నటన ఈ సినిమాకి ప్లస్ పాయింట్. తన 30 ఏళ్ళ అనుభవం మొత్తం కూడా ఈ సినిమాలో చూపించాడు. ఇక తన కామెడీ టైమింగ్ విశ్వరూపం ఏమిటో మరోసారి అందరికీ అర్థం అయ్యేలా చేసాడు. ఇక హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది, కామెడీ టైమింగ్ లో కానీ, ఎమోషన్స్ పండించడం లో కానీ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా ఈ సినిమాలో కూడా అదే చేసాడు.ఇక  ఈ చిత్రానికి సంగీతం అందించిన గోపి సుందర్ మంచి పాటలనుమాత్రం అందించలేకపోయాడు. ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చి ఉంటె ఈ చిత్రం నెక్స్ట్ లెవెల్ కి వెళ్లి ఉండేది.మ్యూజిక్ తప్ప సినిమా అన్నింట్లో సూపర్ గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: