ఆది పురుష్.. ఓటిటి రిలీజ్ డేట్ లాక్..!!

Divya
ప్రభాస్ నటించిన తాజా మైథాలజీ చిత్రం ఆది పురుష్.. ఈ సినిమా ఈనెల 16 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇందులో సీత పాత్రలో కృతి సనన్ నటించింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ పరంగా బాగానే రాబట్టినట్లు తెలుస్తోంది. దాదాపుగా రూ.500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్లో తెరకెక్కించినట్లు సమాచారం. ప్రభాస్ రాముడు గా నటించిన మొదటి సినిమా ఇదే. ముఖ్యంగా రామాయణం కథను మార్చి చూపించారని వివాదాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి


రామాయణం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో కాస్త విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రావణాసురుడు పాత్రను తప్పుగా చూపించారని కొంతమంది అంటుంటే మరి కొంతమంది ఏకంగా రామాయణాన్ని పక్కనపెట్టి ఏదో ఒక చిత్రాన్ని తీశారు కామెంట్లు చేస్తున్నారు.. అయితే ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కలెక్షన్లు తగ్గుతున్నప్పుడే ఈ సినిమా ఓటిటి రిలీజ్ గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి వైరల్ గా మారుతోంది.
ఆది పురుష్ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఓటీటి రిలీజ్ డేట్ పైన నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఆగస్టు 15 వ తేదీన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో స్త్రిమ్మింగ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.త్వరలోనే ఈ విషయం పైన అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇందులో లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ హనుమంతుగా దేవదత్త రావణాసురి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ప్రస్తుతం ప్రభాస్ అన్ని కూడా పాన్ ఇండియా చిత్రాలలోనే నటిస్తున్నారు ఒక్కొక్క సినిమాకి కొన్ని వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరెకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: