చుక్కలు చూపిస్తున్న స్పై మూవీ టికెట్ ధరలు.. టీఎస్ కంటే ఏపీనే బెటర్..!!

Divya
టాలీవుడ్ హీరో నిఖిల్ గత ఏడాది కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించారు.. ఆ తర్వాత 18 పేజీస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నిఖిల్ ఈసారి హ్యాట్రిక్ విజయం పైన కన్ను వేసి స్పై చిత్రాన్ని ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను అలరిస్తున్న నిఖిల్ తన కెరియర్ లో అన్నీ కూడా విభిన్నమైన కథాంశంతో ఉన్న చిత్రాలని ఒప్పుకుంటున్నారు.

తాజాగా డైరెక్టర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో రాబోతున్న స్పై మూవీ కూడా సుభాష్ చంద్రబోస్ మరణం దాని వెనుక ఉన్న కథ ఏంటి అనే విషయం తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్, టీజర్ విడుదల అవ్వగా ప్రేక్షకులను చాలా ఉత్కంఠంగా పరిచేలా కనిపిస్తోంది. ఈ సినిమా ఈ నెల 29వ తేదీన రిలీజ్ చేయబోతోంది అయితే ఈ సినిమా టికెట్లు ధరలు భారీగా పెరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ లలో ధరలు భారీగా పెరిగిపోయినట్లు సమాచారం.. స్పై మూవీ తెలంగాణలో అయితే మల్టీప్లెక్స్ లలో చూడాలి అంటే రూ.295 రూపాయలుగా ఉండగా సింగిల్ స్క్రీన్ థియేటర్లో రూ.175 చెల్లించాల్సి ఉంటుంది.

ఇక తర్వాత ఏపీలో అయితే మల్టీప్లెక్స్ లలో రూ.177 ఉండగా సింగిల్ స్క్రీన్ అయితే రూ.145 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది ఈ సినిమా ట్రైలర్ ప్రమోషన్స్ కు వచ్చిన హైప్ కారణంగా ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా భారీగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈరోజు నిర్వహించబోతున్నారు. అందుకు చీఫ్ గెస్ట్ గా నాగచైతన్య రాబోతున్నట్లు తెలుస్తోంది. నిఖిల్ సరసన ఐశ్వర్య మేనన్ నటిస్తోంది. మరి ఈ సినిమా మొదటి రోజు ఇంతటి కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: