మరోసారి ఆ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్... మరి ఈసారి ఏం చేస్తాడో..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకరు. ఈ నటుడు టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి వి వి వినాయక్ దర్శకత్వం లో రూపొందిన అల్లుడు శీను సినిమాతో వెండి తనకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ నటుడికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఈ యువ నటుడు అనేక సినిమాలలో హీరోగా నటించాడు. అందులో రాక్షసుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ ద్వారా ఈ నటుడుకి మంచి గుర్తింపు కూడా లభించింది.


ఈ సినిమాలో ఈ నటుడు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తో పాటు కొంత కాలం క్రితం ఈ యువ నటుడు కవచం అనే సినిమాలో కూడా హీరోగా నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాలు నడుమ విడుదల అయ్యి ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ఈ సినిమాలో కూడా ఈ యువ నటుడు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ సినిమా అపజయం పాలైనప్పటికీ ఈ మూవీ లో పోలీస్ పాత్రలో నటించిన సాయి శ్రీనివాస్ నటనకు మాత్రం ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇప్పటి వరకు రెండు సినిమాలలో పోలీస్ పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగా అలరించిన ఈ యువ నటుడు మరో సారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.


బెల్లంకొండ శ్రీనివాస్ తన తదుపరి మూవీ ని 14 రీల్స్ బ్యానర్ లో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యానర్ లో రూపొందిపోయే సినిమాలో శ్రీనివాస్ పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పటికి కెరియర్ లో పోలీస్ పాత్రలో నటించి ఒక హిట్ ను ... ఒక ఫ్లాప్ ని అందుకున్న ఈ యువ నటుడు ఈ మూవీ తో ఎలాంటి సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: