ఆ హీరో వల్లే స్పై సినిమా పోస్ట్ పోన్ అయ్యిందా..!!

Divya
యంగ్ హీరో నిఖిల్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో హీరో నిఖిల్ తన చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. గత ఏడాద కార్తికేయ-2 చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. దాదాపుగా రూ .100 కోట్ల రూపాయలకు మించి కలెక్షన్లను రాబట్టింది ఈ చిత్రం. దీంతో నిఖిల్ నుంచి కొత్త సినిమా ఏదైనా వస్తుందంటే చాలు పాన్ ఇండియా లెవెల్ లో అంచనాలు ఏర్పడుతున్నాయి. సరికొత్త కథలను ఎంచుకుంటూ నిఖిల్ తన సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిఖిల్ సినిమా విడుదలవుతోందంటే చాలు ఏదో ఒక కొత్త విషయం గురించి అన్నట్లుగా ప్రేక్షకులలో అభిప్రాయం ఏర్పడింది.


ఈ నేపథ్యంలోనే నిఖిల్ తాజాగా నటించిన చిత్రం స్పై.. ఈ చిత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతి హిస్టరీ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది.ఈ సినిమా ద్వారా మొదటిసారి డైరెక్టర్గా గ్యారి బిహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 29వ తేదీన ఈ సినిమా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేయగా రీసెంట్గా ఈ సినిమా విడుదల చేసిన టీజర్ పైన మంచి స్పందన లభించింది.. అంతేకాకుండా భారత స్వాతంత్ర సమరంలో ఆజాద్ హింద్ సృష్టించిన బ్రిటిసైన్యాన్ని గడగల లాడించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ తర్వాత ఎలా అనుమానస్పదంగా మృతి చెందారు..

ఇండియన్ చరిత్రలో ఇప్పటివరకు ఆయన మరణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఈ మిస్టరీ వెనుక దాగివున్న కథ ఏంటి నేతాజీ మరణం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి అనే విధానాన్ని స్పై చిత్రంలో రూపొందించారు. ఈ విషయాన్ని టీజర్ లో క్లియర్ గా చూపించడం జరిగింది.
 ఈ సినిమా  ఈనెల ఆఖరికి రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేయక నిఖిల్ మాత్రం అందుకు అంగీకరించలేదు.. ఈ విషయంలో నిర్మాతలకు నిఖిల్ కి మధ్య వివాదం తలెత్తిందని సమాచారం. ఈ సినిమా ప్రమోట్ చేయడానికి కాస్త సమయం కావాలి కనుక ఈనెల 29వ తేదీన రిలీజ్ చేస్తే సమయం సరిపోదని నిఖిల్ భావించి ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: