గోపీచంద్ కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న మాస్ హీరోలలో ఒకరు అయినటువంటి మ్యాచో స్టార్ గోపీచంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన సిటీ మార్ మూవీ తో యావరేజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న గోపీచంద్ ఆ తరువాత మారుతీ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమాలో హీరోగా నటించాడు.
 

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించ లేక పోయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఈ నటుడు తాజాగా రామబాణం అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. ఇలా సిటీమార్ మూవీ తర్వాత ఈ హీరో నటించిన రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా గోపీచంద్ తదుపరి మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.

గోపీచంద్ తదుపరి సినిమాను హర్ష దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ గోపీచంద్ కెరీర్ లో 31 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ మూవీ కి రవి బస్రుర్ సంగీతం అందించబోతున్నాడు. ఈ విషయాలను ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన అప్డేట్ ను జూన్ 12 వ తేదీన ప్రకటించనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: