వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అయిన తలపతి విజయ్ లేటెస్ట్ మూవీ..!

Pulgam Srinivas
తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో తాజాగా వారిసు అనే తమిళ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ... అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన నటుడుగా గుర్తింపును సంపాదించుకున్న శ్రీకాంత్ ఈ మూవీ లో విజయ్ కి సోదరుడి పాత్రలో నటించాడు.

ఈ సినిమా తమిళ భాషలో ఈ సంవత్సరం జనవరి 11 వ తేదీన విడుదల అయింది. ఆ తర్వాత ఈ సినిమాలో తెలుగు లో వారసుడు పేరుతో ఈ సంవత్సరం జనవరి 14 వ తేదీన విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు , తమిళ బాక్స్ ఆఫీస్ ల దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని ... భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది.

ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను దక్కించుకున్నటువంటి జెమినీ సంస్థ తాజాగా ఈ మూవీ.ని మరి కొన్ని రోజుల్లో జెమినీ టీవీ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ కి బుల్లి తెరపై ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: