స్టార్ హీరోయిన్ కావాలంటే ఆ పని చేయక తప్పదు.. బలగం బ్యూటీ..!?

Anilkumar
అల్లు అర్జున్ నటించిన గంగోత్రి సినిమాలో వల్లంకి  పిట్టా అంటూ పాట పాడిన చిన్నారిని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఇక ఆ చిన్నారి పేరు కావ్య కళ్యాణ్ రామ్. గంగోత్రి సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో మెరిసింది ఈమె. ఇక అల్లు అర్జున్ నటించిన ఆ సినిమా వచ్చి 20 ఏళ్లకు పైగానే అవుతుంది. అప్పుడు చిన్ననాటి హీరోయిన్గా నటించిన కావ్య ఇప్పుడు నిజంగానే హీరోయిన్ అయిపోయింది. ఆల్రెడీ రెండు సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించింది. ఆమె హీరోయిన్గా నటించిన మసూద బలగం సినిమాలు ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలోనే ఉస్తాద్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిన్నది.
కీరవాణి తనయుడు సింహా హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది కావ్య. వారాహి బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ క్రమంలోనే గత రెండు సినిమాలు తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కావ్య ఈ సినిమాతో కూడా ఖచ్చితంగా మరొక హిట్ని కొడుతుందని భావిస్తున్నారు. అందరూ భావిస్తున్నట్లుగానే ఈ సినిమాతో కూడా కావ్య హిట్ కొడుతుందా లేదా అన్నది చూడాలంటే ఈ సినిమా విడుదల అయ్యేవరకు ఆగాల్సిందే. అయితే తాజాగా కావ్య చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు వైర్లు అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ.. నటిగా నిరూపించుకోవాలంటే అన్ని పాత్రల్లో నటించాల్సి ఉంటుంది.. అప్పుడే సంపూర్ణం నటిగా మనకి ఒక గుర్తింపు వస్తుంది..

సాధారణంగా ఇండస్ట్రీలోనైనా లిప్ లాక్ సీన్స్ బెడ్ సీన్లు కామన్ ..అంతేకాదు ఆ పాత్రల్లో నటించే హీరోయిన్లు అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు.. అంతేకాదు కొన్నిసార్లు కొన్ని సినిమాలకి అవే హైలెట్గా నిలుస్తూ ఉంటాయి.. అలాగే కథ కూడా డిమాండ్ చేయడం వల్ల అలాంటి సీన్లలో నటిస్తారు.. ఇక కథ డిమాండ్ చేసినప్పుడు అలాంటి సన్నివేశాల్లో నటించడానికి నాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది కావ్య. దీంతో ఈ బలగం బ్యూటీపై ఫైర్ అవుతున్నారు నేటిజన్స్ .ఈ క్రమంలోనే కావ్య చేసిన కామెంట్స్ విన్న చాలామంది నేటిజన్స్ కావ్యకి కమర్షియల్ హీరోయిన్ గా ఎదగాలని ఉన్నట్టుంది అంటూ కామెంట్స్ ని సైతం పెడుతున్నారు. దీంతో కావ్య రామ్ చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: