గోపిచంద్ సినిమాలో రవితేజ హీరోయిన్..?

Anilkumar
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ఓ సాలిడ్ హిట్టు చూసి సుమారు తొమ్మిదేళ్లు అవుతుంది. అప్పుడెప్పుడో వచ్చిన 'లౌక్యం' సినిమా తర్వాత ఇప్పటివరకు మళ్ళీ గోపీచంద్ కు సరైన హిట్ దక్కలేదు. మధ్యలో వచ్చిన గౌతమ్ నంద, సిటీ మార్, పక్క కమర్షియల్ సినిమాలు పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకున్నా.. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయాయి. ఇక రీసెంట్ గా భారీ అంచనాలతో విడుదలైన 'రామబాణం' అయితే మొదటి రోజే నెగటివ్ టాక్ ని అందుకుంది. కంప్లీట్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమాకి కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి రాలేదు. అంత దారుణంగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బోల్తా కొట్టింది. 

గోపీచంద్ కి లక్ష్యం, లౌక్యం వంటి మంచి విజయాలను అందించిన శ్రీవాస్ ఈసారి 'రామబాణం'తో ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోయాడు. దీంతో గోపీచంద్ ప్రస్తుతం ఓ మంచి కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే గోపీచంద్ తన తదుపరి చిత్రాన్ని హర్ష అనే దర్శకుడు తో చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో సెట్స్ పైకి కూడా వెళ్లబోతోంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో గోపిచంద్ కి జోడిగా మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఈ హీరోయిన్ తెలుగులో నేల టిక్కెట్, రెడ్ వంటి సినిమాల్లో నటించింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు ప్లాప్స్ గా మిగిలాయి. దీంతో మళ్లీ ఆమెకు టాలీవుడ్ లో అంతగా అవకాశాలు రాలేదు. అయితే రీసెంట్ గా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన 'కిసికా భాయ్ కీసికా జాన్' సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఈమె గోపీచంద్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో గోపీచంద్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు గోపీచంద్ పోలీస్ పాత్రలు పోషించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. దాంతో ఈసారి గోపీచంద్ తనకి  కలిసొచ్చిన పోలీస్ పాత్రనే నమ్ముకున్నట్లు తెలుస్తోంది.ఇక చివరగా , 'గోలీమార్' సినిమాలో పోలీస్ గా కనిపించిన గోపీచంద్ మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరోసారి పోలీస్ గా అలరించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: