ఆర్ ఆర్ ఆర్ రికార్డ్ ను బద్దలు కొట్టిన బలగం సినిమా..!?

Anilkumar
అతి తక్కువ బడ్జెట్ తో తెలంగాణ నేటివిటితో ఊహించిన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమా బలగం. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నవ్వించి జబర్దస్త్ లో ఎన్నో స్కిట్లతో బుల్లితెరపై ప్రేక్షకులను నవ్వించిన కమీడియన్ వేణు మొదటిసారిగా మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ చేశాడు. కమెడియన్ నుండి హీరోగా మారిన ప్రియదర్శి ఈ సినిమాలో హీరోగా నటించాడు. కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన..సక్సెస్ఫుల్ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ.సినిమా ఊహించని సెన్సేషన్ గా నిలిచింది. 

బలగం సినిమా పల్లె వాతావరణం కుటుంబ బంధాలు అన్న చెల్లెల అనుబంధాలతో ఎందరో ప్రేక్షకుల మనసులను గెలిచింది. ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పెట్టారు. వాటితోపాటు ఈ సినిమాలోని ఎమోషన్స్ కుటుంబ నేపథ్య సన్నివేశాలు తెలంగాణ ఆచారాలకు సంబంధించిన సందర్భాలు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించాయి. దీంతో ఈ సినిమాని ఊరూరా ప్రొజెక్టర్ తెరలు ఏర్పాటు చేసి అందరూ వీక్షించారు. ఈ సినిమాని ఈ విధంగా చూశారు అంటేనే అర్థం అవుతోంది ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో. అది తక్కువ బడ్జెట్ తో విడుదలైన ఈ సినిమా 30 కోట్లపై గాని వసూళ్లను రాబట్టింది.

ప్రస్తుతం ఈ సినిమాని టీవీలో కూడా ప్రదర్శించడంతో అక్కడ కూడా ఊహించిన రేటింగ్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. అయితే ఏకంగా బలగం సినిమా త్రిబుల్ ఆర్ సినిమా రేటింగ్ ని దాటేసింది. తాజగా స్టార్ మా లో టెలికాస్ట్ చేశారు .మొదటిసారిగా టీవీలో రావడంతో థియేటర్లో మిస్ అయిన వారందరూ టీవీలోనే చూసారు. దీంతో 14.3 రేటింగ్ దక్కించుకొని బలగం సినిమా బలితెరపై కూడా సత్తా చాటింది. ఇక త్రిబుల్ ఆర్ సినిమాకు 19 రేటింగ్ వచ్చింది. ఇక బలగం సినిమాకి హైదరాబాదులో 22 రేటింగ్ వచ్చిందట. అంతేకాదు బలగం సినిమా అవార్డుల పంట కూడా పండిస్తోంది. చాలా చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను సైతం సొంతం చేసుకుంటుంది. 40 కి పైగా ఈ సినిమా అవార్డులను సొంతం చేసుకుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: